Ram Gopal Varma: 'వ్యూహం' చిత్రంలో వైఎస్ భారతి పాత్రధారి ఈమే: రామ్ గోపాల్ వర్మ

  • వ్యూహం అనే రాజకీయ చిత్రాన్ని ప్రకటించిన వర్మ
  • జగన్ పాత్రలో అజ్మల్ అమీర్
  • వైఎస్ భారతిగా మానస రాధాకృష్ణన్
  • పలు స్టిల్స్ ను పంచుకున్న వర్మ
Ram Gopal Varma reveals Manasa pic who portrays YS Bharathi role in Vyuham

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతేడాది వ్యూహం అనే పొలిటికల్ చిత్రాన్ని ప్రకటించడం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో పాత్రలు, నటులను పరిచయం చేస్తూ వర్మ ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ పాత్రను దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా, వైఎస్ భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ అనే యువతి నటిస్తోంది. ఈ చిత్రానికి చెందిన పలు స్టిల్స్ ను వర్మ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

ఇది బయోపిక్ కాదని, బయోపిక్ ను మించిన రియల్ పిక్ అని వర్మ గతంలోనే ప్రకటించారు. ఇందులో అన్నీ నిజాలే ఉంటాయని తెలిపారు. కాగా, ఈ రియల్ పిక్ రెండు భాగాలుగా వస్తుందని, వ్యూహం మొదటి భాగం అని, రెండో భాగం పేరు శపథం అని వర్మ వివరించారు. 

అప్పట్లో వర్మ సీఎం జగన్ ను కలిసిన వెంటనే ఈ సినిమా ప్రకటన చేయడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. వర్మ తాజా స్టిల్స్ తో మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమా ప్రస్తావన తెచ్చారు.

More Telugu News