Raviteja: ఆసక్తిని పెంచుతున్న 'టైగర్ నాగేశ్వరరావు' ఫస్టు లుక్!

  • 'రావణాసుర'తో ఫ్లాప్ అందుకున్న రవితేజ 
  • తరువాత సినిమాగా రూపొందిన 'టైగర్ నాగేశ్వరరావు'
  • కథానాయికగా నుపుర్ సనన్ పరిచయం 
  • దర్శకత్వం వహిస్తున్న వంశీ  

Tiger Nageshwara Rao First Look Released

రవితేజ కథానాయకుడిగా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఇది. డిఫరెంట్ లుక్ తో రవితేజ ఈ సినిమాలో కనిపించనున్నాడు.

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. టైటిల్ కి తగినట్టుగానే రవితేజ లుక్ ను టైగర్ ఫేస్ తరహాలో డిజైన్ చేసి వదిలారు. ఆయన చూపుల్లో కసి .. కోపం కనిపిస్తున్నాయి. ఈ పాత్రలో రవితేజ ఒక రేంజ్ లో తన సత్తా చూపనున్నాడనే విషయం అర్థమవుతోంది.   

రవితేజ సరసన నాయికగా ఈ సినిమాతో 'నుపుర్ సనన్' పరిచయమవుతోంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో అనుపమ్ ఖేర్ .. రేణు దేశాయ్ కనిపించనున్నారు. ఇటీవల వచ్చిన 'రావణాసుర' ఫ్లాప్ తో అసంతృప్తితో ఉన్న రవితేజ అభిమానులను ఈ సినిమా ఖుషీ చేస్తుందేమో చూడాలి. 

More Telugu News