‘టైగర్ నాగేశ్వర రావు’కు కార్తి మాట సాయం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘టైగర్ నాగేశ్వర రావు’కు కార్తి మాట సాయం!

karthi lends his voice to tiger nageshwara rao movie
  • ‘టైగర్’లో హీరో పాత్రను తమిళంలో పరిచయం చేయనున్న కార్తి
  • కార్తి డబ్బింగ్ చెబుతున్న వీడియోను షేర్ చేసిన మేకర్స్
  • 24న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన
వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ మహరాజ్ రవితేజ. ఈ ఏడాది ఇప్పటికే వాల్తేర్ వీరయ్య, రావణాసుర చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ‘టైగర్‌ నాగేశ్వరరావు’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో తన చిత్రం రిలీజ్ కాబోతోంది.

ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘టైగర్’.. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ 20న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటి నుంచే ప్రమోషన్లతో హైప్‌ తీసుకురావాలని మేకర్స్‌ పక్కా ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్‌ పోస్టర్‌ను మే 24న రిలీజ్‌ చేయనున్నారు.

హీరో పాత్రను పరిచయం చేయడానికి మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌, కన్నడలో శివ రాజ్‌కుమార్‌లు తమ వాయిస్‌లను అందిస్తున్నట్లు ఇటీవలే మేకర్స్ వెల్లడించారు. తాజాగా మరో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. తమిళంలో కార్తి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కార్తి డబ్బింగ్ చెబుతున్న వీడియోను చిత్రబృందం ఈ రోజు ట్విట్టర్ లో పంచుకుంది.

గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వరరావు జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమాను ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ డైరెక్టర్ వంశీకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మిస్తున్నాడు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. రేణుదేశాయ్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు.
Advertisement
Raviteja
karthi
tiger nageshwara rao
Renu Desai

More Telugu News