రాష్ట్రం కోసమే యాగమని నమ్మించే గొప్పవాడివయ్యా.. జగన్ పై ధూళిపాళ్ల నరేంద్ర సెటైర్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్రం కోసమే యాగమని నమ్మించే గొప్పవాడివయ్యా.. జగన్ పై ధూళిపాళ్ల నరేంద్ర సెటైర్లు

dhulipalla narendra sensational tweet on jagan
  • జగన్ చేసిన యాగానికి సంబంధించిన వీడియో ట్వీట్ చేసిన ధూళిపాళ్ల 
  • శత్రువులు నాశనమైపోవాలని, కేసుల్లో సానుకూలత రావాలని సంకల్పం తీసుకున్నారని విమర్శ
  • ప్రజలంతా ఆ సంకల్పాన్ని వినాలని పిలుపు
ఏపీ సీఎం జగన్ చేసిన రాజశ్యామల యాగంపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర విమర్శలు చేశారు. శత్రువులు నాశనం అయిపోవాలని.. కోర్టు కేసుల్లో సానుకూలత రావాలని కోరుకుంటూ యాగ సంకల్పం చేశారని ఆరోపించారు. కానీ బయటికి మాత్రం రాష్ట్రం కోసం యాగం చేస్తున్నట్టు ప్రజలను జగన్ నమ్మిస్తున్నారని మండిపడ్డారు.

గురువారం ఈ మేరకు ధూళిపాళ్ల ఓ ట్వీట్ చేశారు. పూజారులు జగన్ చేత సంకల్పం చేయిస్తున్న వీడియోను షేర్ చేశారు. ‘‘నీ శత్రువులు నాశనం అయిపోవాలి.. నీ కోర్టు కేసుల్లో సానుకూలత రావాలి.. అంటూ యాగ సంకల్పం చేసి.. రాష్ట్రం కోసం యాగం అని నమ్మించే గొప్పవాడివయ్యా’’ అంటూ జగన్ ను దుయ్యబట్టారు. ‘ప్రజలారా.. ఇదిగో ఈ సంకల్పం వినండి’ అని కోరారు.
Advertisement
dhulipalla narendra
Jagan
raja shyamala yagam
TDP
YSRCP

More Telugu News