Raviteja: బాలయ్యతో తలపడనున్న 'టైగర్ నాగేశ్వరావు'

  • ఈ ఏడాదిలో రెండు సినిమాలు చేసిన రవితేజ 
  • మూడో సినిమాగా రూపొందుతున్న 'టైగర్ నాగేశ్వరరావు'
  • దసరాకి భారీ స్థాయిలో విడుదల 
  • అదే పండగకి రానున్న బాలయ్య 108వ సినిమా
Tiger Nageswara Rao movie update

రవితేజ స్పీడ్ గురించి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పుకోవలసిన పనేలేదు. ఏడాదికి తన నుంచి 3 సినిమాలు థియేటర్లకు వెళ్లాలనే ఉద్దేశంతోనే ఆయన పనిచేస్తూ వెళుతుంటాడు. తన సినిమా హిట్ అయినా .. ఫ్లాప్ అయినా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం ఆయనకి అలవాటు.

అలాంటి రవితేజ చిరంజీవితో కలిసి నటించిన 'వాల్తేరు వీరయ్య' ఈ జనవరిలో థియేటర్లకు వచ్చింది. ఆ తరువాత రవితేజ చేసిన 'రావణాసుర' ఏప్రిల్ లో విడుదలైంది. ఇక ఈ అక్టోబర్ 20వ తేదీన ఆయన తాజా చిత్రమైన 'టైగర్ నాగేశ్వరావు' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.

ఒకప్పుడు పోలీస్ యంత్రాంగాన్ని నానా తిప్పలు పెట్టిన స్టూవర్టుపురం దొంగ కథ ఇది. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాలో 'నుపుర్ సనన్' కథానాయికగా నటిస్తుండగా, రేణు దేశాయ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఇక ఈ దసరా పండగకే బాలయ్య 108వ సినిమా విడుదల కానుంది. ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం ఇదే. 

More Telugu News