hd kumaraswamy: మేం కింగ్ మేకర్ కాదు... కింగ్: జేడీఎస్ కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

Will lose 25 winnable seats due to funds crunch says Kumaraswamy
షార్ట్స్‌లో చూడండి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాము గెలిచే అవకాశమున్న 25 అసెంబ్లీ సెగ్మెంట్లలో తమ పార్టీకి గట్టి దెబ్బ తగలనుందని, అయినప్పటికీ ఈ ఎన్నికల్లో తాము కింగ్ కానున్నామని జేడీఎస్ నాయకుడు హెచ్ డీ కుమారస్వామి అన్నారు. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ తన పార్టీ గెలిచే సీట్ల సంఖ్యపరంగా కాంగ్రెస్, బీజేపీల కంటే ముందంజలో ఉంటుందన్నారు. ఎందుకంటే తన పార్టీ కేవలం కింగ్ మేకర్ మాత్రమే కాదని, కింగ్ అన్నారు.

తనకు బాధ కలిగించే విషయం ఏమిటంటే, తాను తన అభ్యర్థులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల పరంగా పక్కన పెడితే తాము ప్రజల మద్దతు పొందగలమని భావిస్తున్నట్లు చెప్పారు. గెలవగలిగే అభ్యర్థులు ఉన్న అనేక నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర, దొడ్డబళ్లాపురలో మాదిరిగా చివరి దశలో అభ్యర్థులను ఆర్థికంగా ఆదుకోవడంలో విఫలమయ్యామన్నారు. తాము 120 సీట్లు గెలవలేకపోయినప్పటికీ తమకే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు.
Go Back to Shorts
hd kumaraswamy
Karnataka
assembly elections

More Telugu News