'విరూపాక్ష' వసూళ్ల అంకెలు మారుతూనే ఉన్నాయ్!
- సాయితేజ్ హీరోగా వచ్చిన 'విరూపాక్ష'
- బలమైన కథాకథనాలతో మెప్పించిన సినిమా
- 13 రోజుల్లో 82.3 కోట్ల వసూళ్లు
- ఈ వీకెండ్ కి 85 కోట్ల మార్క్ ను టచ్ చేసే ఛాన్స్
ఇలాంటి పరిస్థితుల్లో 'విరూపాక్ష' థియేటర్లకు వచ్చింది. సాయితేజ్ - సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా, ఏప్రిల్ 21వ తేదీన విడుదలైంది. కార్తీక్ దండుకి దర్శకుడిగా ఇది రెండో సినిమా. ఇక వరుస ఫ్లాపుల తరువాత సాయితేజ్ చేసిన సినిమా. అందువలన పెద్దగా అంచనాలు లేకుండానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తొలిరోజునే థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, 13 రోజుల్లో 82.3 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ వీకెండ్ కి 85 కోట్ల మార్క్ ను టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. 100 కోట్ల క్లబ్ లో ఈ సినిమా చేరడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. బలమైన కథాకథనాలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ... ఫొటోగ్రఫీ ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయి.