ప్రామిస్ చేస్తున్నాం.. పవన్ ఆవేశాన్ని మీరు మళ్లీ చూడబోతున్నారు..!: ‘ఓజీ’పై అప్ డేట్ ఇచ్చిన మేకర్స్

og makers gave solid update on movie shooting
  • ‘ఓజీ’ సినిమా ముంబై షెడ్యూల్ పూర్తి
  • సోషల్ మీడియాలో వెల్లడించిన మేకర్స్
  • శరవేగంగా షూటింగ్.. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమా రిలీజ్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఓజి’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఒక్క ప్రీ లుక్‌ పోస్టర్‌తోనే సోషల్‌ మీడియా షేక్‌ అయింది. పైగా ఈ సినిమాలో పవన్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపిస్తున్నారు. అప్పుడెప్పుడో పుష్కర కాలం ముందు పవన్‌ ‘పంజా’లో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించారు. 

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ రోజు సాలిడ్ అప్ డేట్ అందించారు. ముంబై షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు పవన్ ఫొటోను కూడా ట్వీట్ చేశారు. ‘‘పవన్ కల్యాణ్ ఆవేశాన్ని మీరు మళ్లీ చూడబోతున్నారు. మేం ప్రామిస్ చేస్తున్నాం’’ అని క్యాప్షన్ ఇచ్చారు.

ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి ఇండస్ట్రీ హిట్‌ను నిర్మించిన దానయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌’ అనే టైటిల్‌ను దాదాపు ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
OG
original gangster
TheyCallHimOG
sujit

More Telugu News