'విరూపాక్ష' 5 రోజుల వసూళ్లు ఇవే!
- ఈ నెల 21న విడుదలైన 'విరూపాక్ష'
- నాలుగు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమా
- 5 రోజుల్లో 55 కోట్ల గ్రాస్ వసూళ్లు
- సాయితేజ్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా
మొదటి రోజునే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. నాలుగు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. 5 రోజులకు గాను ఈ సినిమా 55 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం విశేషం. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ ఒక పోస్టర్ ను వదిలింది.
సాయితేజ్ కెరియర్ లో ఇంత వేగంగా 50 కోట్లకు పైగా కొల్లగొట్టిన సినిమా ఇదేనని చెప్పాలి. 'చిత్రలహరి' తరువాత నుంచి వరుస ఫ్లాపులతో ఉక్కిరి బిక్కిరవుతున్న సాయితేజ్ కి, ఈ సినిమా ఊరటనిచ్చింది. అలాగే సంయుక్త మీనన్ కి కూడా కాస్త గుర్తింపు తెచ్చిపెట్టిన పాత్ర ఇది. ఈ వారం థియేటర్లలో దిగుతున్న 'ఏజెంట్' .. 'పొన్నియిన్ సెల్వన్ 2' పోటీని తట్టుకుని ఈ సినిమా ఎంతవరకూ నిలబడుతుందనేది చూడాలి.