Ntr: ఎన్టీఆర్ కోసం రంగంలోకి దిగిపోయిన సైఫ్ అలీఖాన్!

  • షూటింగు దశలో కొరటాల సినిమా
  • ఎన్టీఆర్ జోడీగా అలరించనున్న జాన్వీ కపూర్ 
  • ప్రతినాయకుడిగా కనిపించనున్న సైఫ్ 
  • విదేశాల్లో ఎక్కువగా జరగనున్న షూటింగ్
Ntr and koratala movie update

కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కెరియర్ పరంగా ఇది ఎన్టీఆర్ కి 30వ సినిమా. ఎన్టీఆర్ ఆర్ట్స్ - యువసుధ ఆర్ట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్ ను తీసుకున్నారు. ఈ సినిమాతోనే కథానాయికగా ఆమె టాలీవుడ్ కి పరిచయమవుతోంది. 

రీసెంట్ గా హైదరాబాద్ లో మొదలెట్టిన తాజా షెడ్యూల్ షూటింగులో జాన్వీ కపూర్ జాయిన్ అయింది. ఇక తాజాగా సైఫ్ అలీఖాన్ కూడా జాయిన్ అయ్యాడు. ఈ ముగ్గురి కాంబినేషన్లో కీలకమైన సన్నివేశాలను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంలో కొరటాల - ఎన్టీఆర్ తో కలిసి సైఫ్ దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సైఫ్ కూడా తెలుగులో చేస్తున్న ఫస్టు మూవీ ఇదే. ఇది భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమా. విదేశాల్లోనే ఈ సినిమా షూటింగు ఎక్కువగా జరగనుందని సమాచారం. సంగీత దర్శకుడిగా అనిరుధ్ తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నట్టుగా చెబుతున్నారు. 

More Telugu News