ఎన్టీఆర్ మూవీ టైటిల్ ఇదేనంటూ రూమర్!
- ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన కొరటాల ప్రాజెక్టు
- కెరియర్ పరంగా ఎన్టీఆర్ కి ఇది 30వ సినిమా
- ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్
- ప్రతినాయకుడిగా కనిపించనున్న సైఫ్ అలీఖాన్
- 'వస్తున్నా' టైటిల్ ఖరారు కావొచ్చని టాక్
ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. అవసరమైన చోట ఎన్టీఆర్ 30వ సినిమాగానే పేర్కొంటూ వస్తున్నారు. అయితే ఈ సినిమాకి 'వస్తున్నా' అనే టైటిల్ ను సెట్ చేసినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా 'పార్టీ లేదా పుష్ప' అని ఎన్టీఆర్ అడిగితే, 'వస్తున్నా' అని బన్నీ సమాధానమిచ్చాడు.
ఇక అప్పటి నుంచి ఇదే ఆ సినిమా టైటిల్ అయ్యుంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. బన్నీకి ముందుగా ఆ టైటిల్ గురించి తెలియడం వల్లనే ఆయన ఆ మాటను ఉపయోగించాడని అంటున్నారు. ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చనే టాక్ బలంగానే షికారు చేస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో విలన్ గా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు.