రవితేజ రావణాసుర తొలి రోజు వసూళ్లు అంతేనా!
- దేశ వ్యాప్తంగా రూ. 5.5 కోట్లు రాబట్టిన నూతన చిత్రం
- నాని దసరా తొమ్మిదో రోజు వసూళ్ల కంటే తక్కువే
- సుదీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్
రవితేజ గత సినిమాలు ధమాకా రూ. 9.48 కోట్లు, కిలాడీ రూ.6.8 కోట్లు, రామారావు ఆన్ డ్యూటీ రూ. 6.3 కోట్ల మేర ఓపెనింగ్ వసూళ్లను సాధించాయి. ఈ లెక్కన రావణాసురకు మంచి ఆరంభం దక్కలేదని చెప్పాలి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.25 కోట్ల వసూళ్లు రావాలి. అయితే, వారాంతంలో వసూళ్లు పెరుగుతాయని చిత్ర బృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ను అభిషేక్ నామా నిర్మించారు. అక్కినేని సుశాంత్ కీలక పాత్ర పోషించగా.. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు.