ప్రెగ్నెన్సీ ఆలస్యం మా ఇద్దరి నిర్ణయమే: ఉపాసన

Upasana opines on late pregnancy
  • గర్భం దాల్చిన ఉపాసన
  • ప్రెగ్నెన్సీ ఆలస్యం కావడానికి గల కారణం వెల్లడించిన వైనం
  • పెళ్లయిన పదేళ్ల వరకు పిల్లలు వద్దనుకున్నామని వివరణ
మెగా కుటుంబంలో ఆనందం నింపుతూ రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన గర్భం దాల్చడం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గర్భంపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లయిన పదేళ్ల వరకు పిల్లలు వద్దనుకున్నామని, అందుకే ప్రెగ్నెన్సీ ఆలస్యం అయిందని వెల్లడించారు. ప్రెగ్నెన్సీ ఆలస్యం నిర్ణయం తామిద్దరిదీ అని స్పష్టం చేశారు. పుట్టే పిల్లలకు తాము అన్నీ సమకూర్చగల స్థాయికి వచ్చామని ఉపాసన వివరించారు. 

"నేను, చరణ్ మా రంగాల్లో ఎదిగాం. సమాజం, బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల ఒత్తిడితో కాకుండా, నేను తల్లిని కావాలని కోరుకున్నప్పుడే గర్భం దాల్చడం సంతోషం కలిగించింది" అంటూ ఉపాసన వివరించారు.
Advertisement
Upasana
Pregnancy
Ram Charan
tol

More Telugu News