సైంథవ్ లో వెంకీకి హీరోయిన్ దొరికినట్టే!
- శైలేష్ కొలను దర్శకత్వంలో సైంథవ్ చేస్తున్న వెంకటేశ్
- ప్రధాన హీరోయిన్ గా శ్రద్థా శ్రీనాథ్ ను అనుకుంటున్న చిత్ర బృందం
- రెండో హీరోయిన్ గా రుహానీ శర్మను ఓకే చేసినట్టు ప్రచారం
ఈ సినిమాలో వెంకీ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు తెలుస్తుంది. అందులో సెకండ్ హీరోయిన్గా రుహాని శర్మను ఖరారు చేసినట్టు సమాచారం. ప్రధాన హీరోయిన్ గా జెర్సీ ఫేం శ్రద్ధ శ్రీనాథ్‌ను పరిశీలిస్తునట్టు తెలుస్తోంది. డైరెక్టర్ శైలేష్ ఇప్పటికే ఆమెకు కథ చెప్పారని, తను కూడా పాజిటివ్ గా స్పందించిందని సమాచారం. కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ జెర్సీతో మంచి విజయం అందుకుంది. తర్వాత ఆమెకు మరో బ్రేక్ రాలేదు. ఇప్పుడు వెంకీ సరసన నటిస్తే టాలీవుడ్ లో ఆమెకు మరింత గుర్తింపు రావడం ఖాయమే అనొచ్చు.