Raviteja: 'టైగర్ నాగేశ్వరరావు' రిలీజ్ డేట్ ఖరారు!

  • ఏప్రిల్ 7వ తేదీన 'రావణాసుర' విడుదల 
  • ఆ తరువాత సినిమాగా రవితేజ చేస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు'
  • ఇది ఓ స్టువర్టుపురం గజదొంగ కథ  
  • కథానాయికగా నుపుర్ సనన్ పరిచయం 
  • అక్టోబర్ 20వ తేదీన సినిమా విడుదల 
Tiger Nageswara Rao movie release date confirmed

రవితేజ నుంచి క్రితం ఏడాది మూడు సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలలో 'ధమాకా' భారీ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది ఆరంభంలోనే చిరంజీవితో కలిసి 'వాల్తేరు వీరయ్య'లో కనిపించిన రవితేజ, 'రావణాసుర' సినిమాతో థియేటర్లకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఏప్రిల్ 7వతేదీన ఈ సినిమా విడుదలవుతోంది. 

ఈ సినిమాలో రవితేజ నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తుండటం ఆసక్తిని రేకెత్తించే విషయం. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ సరసన నాయికలుగా ఐదుగురు హీరోయిన్స్ కనిపించనుండటం ఓ విశేషం. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ఆయన తదుపరి సినిమా రిలీజ్ డేట్ గురించిన ప్రకటన కూడా వచ్చేయడం మరో విశేషం. 

రవితేజ హీరోగా 'టైగర్ నాగేశ్వర రావు' సినిమా రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి మహేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 1970 - 80లలో స్టువర్ట్ పురం గజదొంగగా పోలీసులకు నిద్రలేకుండా చేసిన 'టైగర్ నాగేశ్వరరావు' కథ ఇది. నుపుర్ సనన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, దసరా పండుగ కానుకగా, అక్టోబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

More Telugu News