నా భార్య అలిగింది.. బుజ్జగించేందుకు 10 రోజుల సెలవు కావాలి: ఎస్పీకి ఇన్‌స్పెక్టర్ లీవ్ లెటర్
- 22 ఏళ్లుగా తన భార్యను హోలీ కోసం పుట్టింటికి తీసుకెళ్లలేకపోయానన్న సీఐ
- 10 రోజులపాటు సెలవు కావాల్సిందేనని లీవ్ లెటర్
- 5 రోజులు మంజూరు చేసిన ఎస్పీ
ఈసారి తనతో కలిసి పుట్టింటికి వెళ్లాలని కోరుకుంటోందని, కాబట్టి తనకు సెలవులు తప్పనిసరిగా అవసరమని పేర్కొన్నారు. తన సమస్యను పరిగణనలోకి తీసుకుని పది రోజులు సెలవు మంజూరు చేయాలని కోరారు. ఈ లీవ్ లెటర్ చదివిన ఎస్పీ అశోక్ కుమార్ మీనా నవ్వు ఆపుకోలేకపోయారు. ఇన్‌స్పెక్టర్ కోరినట్టు కాకుండా ఐదు రోజుల సెలవులు మంజూరు చేసినట్టు తెలుస్తోంది.
బీహార్‌లో ఉపాధ్యాయులు
గతంలో బీహార్‌లోనూ ఇలాంటి వింతైన లీవ్ లెటర్స్ సోషల్ మీడియాకెక్కాయి. తన తల్లి చనిపోబోతోందని, అంత్యక్రియల కోసం పలానా రోజుల్లో సెలవులు కావాలని ఒకరు, త్వరలోనే తన ఆరోగ్యం పాడవబోతోందని, కాబట్టి సెలవులు కావాలని మరొకరు, నేనో పెళ్లికి వెళ్లాలని, అక్కడి విందులో ఏది పడితే అది తినేస్తే కడుపు నొప్పి వస్తుంది కాబట్టి సెలవు కావాలని ఇంకొకరు ఇలా.. విద్యాశాఖాధికారులకు ఉపాధ్యాయులు రాసిన సెలవు చీటీలు గతేడాది సామాజిక మాధ్యమాలకెక్కి నవ్వు తెప్పించాయి.