రవితేజ ‘రావణాసుర’ నుంచి అప్​డేట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవితేజ ‘రావణాసుర’ నుంచి అప్​డేట్

Ravanasura wraps shoot
  • షూటింగ్ పూర్తయినట్టు ప్రకటించిన నిర్మాతలు
  • సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రం
  • ఏప్రిల్ 7న విడుదల
ధమాకా, వాల్తేరు వీరయ్యతో ఘన విజయాలు సొంతం చేసుకొని జోరు మీదున్న మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ‘రావణాసుర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌‌.టి. టీమ్‌వర్క్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్‌లో తీసిన ఓ పాటతో షూటింగ్ పూర్తి చేసి గుమ్మడి కాయ కొట్టేశారు. 

ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. హీరో హీరోయిన్లపై ఈ పాటను తెరకెక్కించారు. కాగా, ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుశాంత్ ప్రతినాయక పాత్ర పోషించాడు. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో, హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
Advertisement
Tollywood
Raviteja
Ravanasura
shooting

More Telugu News