నేను, నా భార్య ఇప్పుడు జీవితాలను కొత్త కోణంలో చూస్తున్నాం: రామ్ చరణ్

Ram Charan talks about his fatherhood
  • తల్లి కాబోతున్న ఉపాసన
  • ఇంత ఆనందాన్ని మాటల్లో చెప్పలేమన్న రామ్ చరణ్
  • తమ జీవితంలో ఇంకో వ్యక్తి రానుండడం అద్భుతమని వివరణ
  • తల్లిదండ్రుల తర్వాత ఈ విషయం చెప్పింది ఎన్టీఆర్ కేనని వెల్లడి
తండ్రి అయ్యే అనుభూతి కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ కు ఆ కోరిక త్వరలోనే తీరబోతోంది. రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన ప్రస్తుతం గర్భవతి. దీనిపై రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. 

"నా సంతానం గురించి మా అమ్మానాన్నతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మా జీవితంలో ఇంకో వ్యక్తి వస్తుండడంతో ఆ భావనతో ఎంతో ఉప్పొంగిపోతున్నాం. ప్రెగ్నెన్సీ విషయం తెలిశాక నేను, నా భార్య జీవితాలను కొత్త కోణంలోంచి చూస్తున్నాం. ఇంత ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. నాకంటే మా అమ్మానాన్న ఎక్కువ సంతోషించారు" అని వివరించారు. 

ఇక తాను తండ్రి కాబోతున్నానన్న విషయాన్ని తల్లిదండ్రుల తర్వాత తాను పంచుకున్నది తన ప్రాణస్నేహితుడు జూనియర్ ఎన్టీఆర్ తోనే అని రామ్ చరణ్ వెల్లడించారు. "మీడియా కంటే ముందే తారక్ తోనే చెప్పాను. ఎంతో సంతోషించాడు" అని తెలిపారు. 

ఇకపై నేను ఉపాసనకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుందని అనుకుంటున్నా అని వివరించారు.
Go Back to Shorts
Ram Charan
Upasana
Pregnancy
Tollywood

More Telugu News