Raviteja: రవితేజ పాడిన పాటకి మిలియన్ల కొద్దీ వచ్చిపడుతున్న వ్యూస్!

  • విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'రావణాసుర'
  • రవితేజ సరసన ఐదుగురు హీరోయిన్స్
  • సంగీతాన్ని అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్
  • ఏప్రిల్ 7వ తేదీన సినిమా విడుదల  
Ravanasura movie update

హీరోలు అప్పుడప్పుడు తమ పాటను తామే పాడుకోవడం చేస్తుంటారు. హీరోనే ఆ పాటను పాడితే ఆ ప్రాజెక్టుపై మరింత క్రేజ్ పెరుగుతుందని సంగీత దర్శకులకు అనిపించినప్పుడు వారితో ఈ తరహా ప్రయోగాలను చేయిస్తుంటారు. టాలీవుడ్ లో మెగాస్టార్ సహా చాలామంది హీరోలు అప్పుడప్పుడు గాయకులుగా మారిపోయారు. 

అలా తాజాగా 'రావణాసుర' సినిమా కోసం రవితేజ కూడా సింగర్ గా మారిపోయాడు. ఈ సినిమా నుంచి రెండు రోజుల క్రితం 'ప్యార్ లోన పాగల్' అనే పాటను వదిలారు. ప్రేమించిన అమ్మాయి తనని మోసం చేసి వెళ్లిపోయిందంటూ హీరో తన గోడును వెళ్లబోసుకునే పాట ఇది. రవితేజనే పాడిన ఈ పాటను హీరో బృందంపై చిత్రీకరించారు. 

ఈ పాటను ఇలా వదిలారో లేదో అలా దూసుకుపోతోంది. 3 మిలియన్ ప్లస్ వ్యూస్ ను కొల్లగొట్టేసింది. రవితేజ గానం .. ఆయన మాస్ స్టెప్పులు ఈ పాటకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. రవితేజ సరసన ఐదుగురు హీరోయిన్స్ సందడి చేయనున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లో సుధీర్ వర్మ రూపొందించిన ఈ సినిమాను, ఏప్రిల్ 7వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News