ఇంగ్లీషు రాక క్రీడా పాత్రికేయుడి తంటాలు... వీడియో ఇదిగో!
- బంగ్లా ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర దృశ్యం
- మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లతో మాట్లాడేందుకు జర్నలిస్టు ప్రయత్నం
- వచ్చిరాని ఇంగ్లీషుతో ఇబ్బందులు
- అతడేం అడుగుతున్నాడో తెలియక తలలు పట్టుకున్న క్రికెటర్లు
తొలుత ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీని పలకరించాడు. అతడేం మాట్లాడుతున్నాడో మొయిన్ అలీకి అర్థంకాక "ఏమంటున్నారు..." అంటూ పదే పదే అడిగాడు. ఆ తర్వాత వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ రసెల్ ను కూడా ఆ మీడియా ప్రతినిధి తన భాషతో ఇబ్బంది పెట్టాడు.
నువ్వు అడిగిన దానికి అర్థం ఏమిటి? అని రసెల్ తిరిగి ఈ జర్నలిస్టును ప్రశ్నించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.