Tollywood: భోళా శంకర్ నుంచి శివ రాత్రి కానుక ఈ సాయంత్రం 6 గంటలకు

  • స్ట్రీక్ ఆఫ్ శంకర్ విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటన
  • మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
  • వాల్తేరు వీరయ్యతో ఘన విజయం సొంతం చేసుకున్న చిరు
Shivratri gift from Bhola Shankar this evening at 6 oclock

ఆచార్య పరాజయం తర్వాత  వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ చిరంజీవి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమాతో తనలోని మాస్ పవర్ ను మరోసారి చూపెట్టారు మెగాస్టార్.  చిరుకు తోడు మాస్‌ మహారాజా కూడా తోడవడంతో సంక్రాంతికి కలెక్షన్ల వరద పారింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ లాభాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం చిరు ‘భోళాశంకర్‌’ సినిమా చేస్తున్నారు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది.

తమిళంలో సూపర్‌ హిట్టయిన ‘వేదాళం’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేష్‌ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. శివరాత్రి కానుకగా ఈ చిత్రంలోని మెగాస్టార్ గ్లింప్స్‌ను స్ట్రీక్ ఆఫ్ శంకర్ పేరిట ఈ సాయంత్రం 6 గంటలకు రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

More Telugu News