తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ.. దరఖాస్తును ఆమోదించిన ఏపీ సీఎం జగన్!

తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ.. దరఖాస్తును ఆమోదించిన ఏపీ సీఎం జగన్!

Telangana Ex CS Somesh Kumar taken Voluntary Retirement
  • ఏపీకి వెళ్లాలంటూ సోమేశ్‌కుమార్‌కు ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశం
  • గత నెల 12న ఏపీ కేడర్‌లో రిపోర్టు చేసిన సోమేశ్ కుమార్
  • నెల రోజులు దాటుతున్నా పోస్టు కేటాయించని ఏపీ ప్రభుత్వం
  • స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తుకు సీఎం ఆమోదం!
తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్వచ్చంద పదవీ విరమణ చేసినట్టు తెలుస్తోంది. సోమేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలంటూ తెలంగాణ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆయనను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించి శాంతికుమారిని కొత్త సీఎస్‌గా నియమించింది.

హైకోర్టు ఆదేశాలతో జనవరి 12న అమరావతికి వెళ్లి ఏపీ కేడర్‌లో రిపోర్టు చేసిన సోమేశ్ కుమార్ ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మరోవైపు, ఆయన ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసి నెల రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి పోస్టు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయాలన్న నిర్ణయానికి వచ్చిన ఆయన ఈ మేరకు దరఖాస్తు పెట్టుకున్నారు. తాజాగా ఆయన దరఖాస్తును ముఖ్యమంత్రి జగన్ ఆమోదించినట్టు తెలుస్తోంది.
Advertisement
Somesh Kumar
Andhra Pradesh
TS High Court
Telangana

More Telugu News