క్రిష్ చేతుల మీదుగా 'ఓ సాథియా' మూవీ నుంచి 'వెళ్లిపోయే' సాంగ్ రిలీజ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క్రిష్ చేతుల మీదుగా 'ఓ సాథియా' మూవీ నుంచి 'వెళ్లిపోయే' సాంగ్ రిలీజ్!

O Saathiya movie song released
  • అందమైన ప్రేమకథగా ' ఓ సాథియా'
  • ఆర్యన్ గౌర జోడీగా మిష్టి చక్రవర్తి
  • సంగీత దర్శకుడిగా 'విన్ను' పరిచయం 
  • టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పిన డైరెక్టర్ క్రిష్  
లవ్ సాంగ్స్ .. అందునా మెలోడీ ట్యూన్స్ ప్రేక్షక లోకానికి ఇట్టే నచ్చేస్తుంటాయి. అలాంటి చక్కటి మెలోడి గీతాలతో ..  మంచి ప్రేమ కథతో 'ఓ సాథియా' అనే మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు దర్శక నిర్మాతలిద్దరూ మహిళలే కావడం విశేషం. 'ఓ సాథియా' అనే చిత్రాన్ని చందన కట్టా నిర్మించగా, దివ్య భావన దర్శకత్వం వహించారు. ప్రమోషన్స్ లో భాగంగా స్టార్ డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా 'వెళ్లిపోయే..' లిరికల్ సాంగును రిలీజ్ చేయించారు. 

'వెళ్లిపోయే.. పాపా వెళ్లిపోయే ..' అంటూ సాగిపోయే ఈ బ్రేకప్ సాంగ్ లో లిరిక్స్ యూత్ ను ఆకట్టుకుంటున్నాయి. భాస్కరభట్ల రాసిన పదాల కూర్పులో నిజమైన ప్రేమికుడి భావాలు మనసుకు హత్తుకుంటున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ ఆలాపన .. బాబా భాస్కర్ కొరియోగ్రఫీ ఈ పాటలో హైలైట్ అయ్యాయి. 'విన్ను'  అందించిన మ్యూజిక్ ఈ సాంగ్‌కి మేజర్ అట్రాక్షన్ గా మారింది. 

ఈ సాంగ్ రిలీజ్ చేసిన క్రిష్.. 'ఓ సాథియా' సినిమా యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెప్పారు. సాంగ్ చాలా బాగా వచ్చిందనీ, ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో ఆర్యన్ గౌర .. మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.   

గతంలో విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా విడుదలైన ఫస్టులుక్ .. మణిశర్మ చేతుల మీదుగా విడుదలైన టైటిల్ సాంగ్‌ కు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభించగా, ఇప్పుడు డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా వదిలిన 'వెళ్లిపోయే' సాంగ్ కూడా చాలా  స్పీడుగా వ్యూస్ రాబడుతోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
Advertisement
Aryan Goura
Misthi Chakravarthi
O Saathiya Movie

More Telugu News