నాలా సింహంలా పుట్టాలి: 'వీరసింహారెడ్డి' సెలబ్రేషన్స్ లో బాలయ్య

veerasimha Redddy Celebrations
  • 'వీరసింహారెడ్డి' విజయోత్సవ వేడుకలో బాలయ్య 
  • తన మేనరిజంలో నుంచే కథ పుట్టిందంటూ వ్యాఖ్య 
  • విలనిజం ఈ సినిమాకి హైలైట్ అని వెల్లడి 
  • తమన్ పాటలు ప్రాణం పోశాయని కితాబు

'వీరసింహారెడ్డి' సినిమా బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ హైదారాబాదులో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకి ఈ సినిమా నటీనటులు .. సాంకేతిక నిపుణులతో పాటు, హరీశ్ శంకర్ .. హను రాఘవపూడి .. అనిల్ రావిపూడి .. శివ నిర్వాణ .. బీవీఎస్ రవి .. విష్వక్సేన్ .. సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు హాజరయ్యారు. ఈ వేదికపై బ్లాక్ బస్టర్ షీల్డ్స్ ను బాలకృష్ణ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. 

ఈ స్టేజ్ పై బాలకృష్ణ మాట్లాడుతూ .. " ఏ విషయాన్నైనా నిజాయితీగా .. ధైర్యంగా చెప్పడమనేది ఒక గర్జనలా ఉండాలి. అలా ఉండాలంటే నాలా సింహంలా పుట్టాలి. ఈ సినిమాలో ఎదురులేని .. బెదురులేని వీరసింహారెడ్డిని నేనే. చాలా ఏళ్ల తరువాత నేను చేసిన ఫ్యాక్షన్ సినిమా ఇది. నా మేనరిజంలో నుంచే ఒక్కోసారి కథలు పుడుతూ ఉంటాయి. ఆ విషయంలో బోయపాటి సమర్థుడు.

 అలాగే ఈ సారి నా మేనరిజంలో నుంచి కథను తీశాడు గోపీచంద్ మలినేని. అలాంటి ఈ కథను వివిధ ప్రాంతాలకి చెందిన వివిధ భాషల వారు కూడా ఆదరించడం విశేషం. ఈ సినిమాకి దునియా విజయ్ .. వరలక్ష్మి శరత్ కుమార్ విలనిజం హైలైట్ గా నిలిచాయి. తమన్ పాటలు ప్రాణం పోశాయి. ఆదరించిన అందరికీ ధన్యవాదాలు" అంటూ చెప్పుకొచ్చారు..
Go Back to Shorts
Balakrishna
Sruthi Haasan
Gopichand Malineni

More Telugu News