ఇక సినిమాల్లో నటించనన్న వార్తలపై నటి సాయి పల్లవి స్పందన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇక సినిమాల్లో నటించనన్న వార్తలపై నటి సాయి పల్లవి స్పందన

actor sai pallavi reaction on doctor practise news
  • మంచి కథకు నా ప్రాధాన్యమని చెప్పిన సాయి పల్లవి
  • మంచి కథ వస్తే ఏ భాషలో అయినా నటిస్తానని వెల్లడి
  • గార్గీ చిత్రం తర్వాత మరొక సినిమాకు ఓకే చెప్పకపోవడంతో వదంతులు
సాయి పల్లవి ప్రత్యేకమైన నటి అని చెప్పడంలో సందేహం లేదు. సహజ నటిగా పేరు కూడా తెచ్చుకుంది. అయితే ఇటీవల ఈ అమ్మడు ఏ ఒక్క సినిమాలోనూ నటించడం లేదు. కొంత గ్యాప్ వచ్చింది. ఇంకేముంది నటి సాయి పల్లవి నటనకు గుడ్ బై చెప్పి, డాక్టర్ ప్రాక్టీస్ కు వెళుతోందంటూ ఈ మధ్య కాలంలో ఓ ప్రచారం నడుస్తోంది. ఇందులో నిజం ఎంత అంటూ ఓ మీడియా సంస్థ ఆమెను ప్రశ్నించింది.

దీనికి సాయి పల్లవి స్పందిస్తూ.. మంచి కథకు తాను ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేసింది. మంచి కథ వస్తే భాషతో సంబంధం లేకుండా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పింది. తాను నటించిన సినిమాలు ప్రేక్షకులకు నచ్చాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొంది. సాయి పల్లవి చివరిగా గతేడాది విడుదలైన  గార్గీ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత మరో సినిమాను ఇంత వరకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఇక నటించబోదన్న ప్రచారానికి అవకాశం లభించినట్టయింది. మంచి కథనం నచ్చకపోవడమే సాయి పల్లవి గ్యాప్ కు కారణమన్నది తెలుస్తోంది. డాక్టర్ చదివినా, నటనపై ఆసక్తితోనే ఆమె సినిమా పరిశ్రమలోకి రావడం తెలిసిందే.
Advertisement
actor
sai pallavi
best story
doctor practise
rumors

More Telugu News