దూసుకుపోతున్న 'వీరసింహారెడ్డి' ట్రైలర్!
- నిన్న జరిగిన 'వీరసింహారెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్
- బి.గోపాల్ చేతుల మీదుగా రిలీజ్ అయిన ట్రైలర్
- 5 మిలియన్ ప్లస్ వ్యూస్ నమోదు
- 300Kకి పైగా లభించిన లైక్స్
- ఈ నెల 12వ తేదీన విడుదలవుతున్న సినిమా
ఇక యూ ట్యూబ్ లో ఈ ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. చాలా ఫాస్టుగా ఈ ట్రైలర్ 5 మిలియన్ ప్లస్ వ్యూస్ ను .. 300K లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. ఇంకా ఈ ట్రైలర్ కి సంబంధించిన వ్యూస్ .. లైక్స్ డిజిట్స్ చకచకా మారిపోతూనే ఉన్నాయి.
ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా, మరో ముఖ్యమైన పాత్రలో హనీరోజ్ అలరించనుంది. ఇక విలన్ షేడ్స్ కలిగిన భానుమతి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుండగా, ఐటమ్ నెంబర్ లో చంద్రిక రవి మెరవనుంది. మొత్తానికి ఈ సినిమా కొత్త రికార్డులకు తెరతీయనుందనేది అభిమానుల టాక్.