నాగశౌర్య ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఫస్ట్ లుక్ విడుదల
- శౌర్య సరసన హీరోయిన్ గా మాళవిక నాయర్
- అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం
- ఈ మధ్యే పెళ్లి చేసుకొని ఇంటివాడైన నాగశౌర్య
నాగశౌర్య, మాళవిక వింటర్ కోట్స్ ధరించి ప్రయాణంలో ఒకరిపై ఒకరు వాలిపోయి సంగీతం వింటూ కనిపిస్తున్న పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రం హీరో హీరోయిన్ల మధ్య సాగే పదేళ్ల ప్రేమ ప్రయాణం అని దర్శకుడు శ్రీనివాస్ చెప్పారు. 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వయస్సు వరకు సాగే వారి ప్రయాణం సన్నివేశాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయని, ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలిపారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్, దాసరి పద్మజ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కల్యాణి మాలిక్, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఇతర నటీనటులు, విడుదల తేదీ గురించి తెలియాల్సి ఉంది.