బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన వాయుసేన

బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన వాయుసేన

IAF successfully test fires BrahMos missile
  • భారత్, రష్యా కలిసి అభివృద్ధి చేసిన బ్రహ్మోస్
  • ధ్వనివేగాన్ని మించిన వేగంతో దూసుకెళ్లే సూపర్ సోనిక్ మిస్సైల్
  • తాజాగా సుఖోయ్ నుంచి ప్రయోగం
  • బంగాళాఖాతంలో లక్ష్యాన్ని ఛేదించిన క్షిపణి
భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన సూపర్ సోనిక్ మిస్సైల్ బ్రహ్మోస్. ఇప్పటివరకు అనేక పరీక్షలను అధిగమించిన బ్రహ్మోస్ శత్రుభీకర అస్త్రంగా గుర్తింపు తెచ్చుకుంది. 

తాజాగా, మరింత అభివృద్ధి పరిచిన బ్రహ్మోస్ క్షిపణిని భారత వాయుసేన విజయవంతంగా పరీక్షించింది. దీన్ని సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి ప్రయోగించగా, బంగాళాఖాతంలోని ఓ లక్షిత ఓడను గురితప్పకుండా తాకింది. ఈ మేరకు భారత వాయుసేన ట్విట్టర్ లో వెల్లడించింది. 

బ్రహ్మోస్ మిస్సైల్ రేంజి 450 కిలోమీటర్లు. దీన్ని భూతలం, గగనతలం, నౌకల్లోంచి ప్రయోగించవచ్చు. ఇది ధ్వనివేగం కంటే మూడు రెట్లు అధిక వేగంతో ప్రయాణిస్తుంది. గరిష్ఠంగా మాక్ 2.8 వేగాన్ని అందుకోగలదు. తాజా ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో, భారత వాయుసేన పోరాట సామర్థ్యం మరింత పెరిగింది.
Advertisement
BrahMos
Supersonic Missile
IAF
Sukhoi-30MKI
India
Russia

More Telugu News