మీ అద్భుతమైన విజయంతో సంతోషిస్తున్నా: అర్జెంటీనాపై మోదీ ప్రశంసలు
- ఫైనల్స్ మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్న మోదీ
- అర్జెంటీనా విజయంతో భారతీయ మెస్సీ అభిమానులు సంతోషిస్తున్నార్న మోదీ
- ఫ్రాన్స్ స్ఫూర్తిదాయకమైన ఆటతీరును కనపరిచిందని కితాబు
అర్జెంటీనా - ఫ్రాన్స్ ల మధ్య జరిగిన ఫైనల్స్ సమరం అత్యంత థ్రిల్లింగ్ మ్యాచ్ గా గుర్తుండిపోతుందని మోదీ అన్నారు. ఫిఫా వరల్డ్ కప్ ఛాంపియన్స్ అర్జెంటీనాకు శుభాకాంక్షలు తెలిపారు. టోర్నమెంట్ ప్రారంభం నుంచి చివరి వరకు అద్భుతంగా ఆడారని కితాబునిచ్చారు. ఈ విజయం పట్ల అర్జెంటీనా, మెస్సీని అభిమానించే లక్షలాది మంది భారతీయులు సంతోషిస్తున్నారని అన్నారు. ప్రపంచకప్ లో స్ఫూర్తిదాయకమైన ప్రతిభను కనపరిచిందంటూ రన్నరప్ ఫ్రాన్స్ పై మోదీ ప్రశంసలు కురిపించారు. ఫుట్ బాల్ ప్రియులను ఫ్రాన్స్ ఆటగాళ్లు ఉర్రూతలూగించారని ప్రశంసించారు.