అవతార్-2 తొలి రోజు కలెక్షన్ల వివరాలు ఇవిగో!

అవతార్-2 తొలి రోజు కలెక్షన్ల వివరాలు ఇవిగో!

Avatar 2 day 1 collections in India
  • డిసెంబరు 16న రిలీజైన అవతార్-2
  • జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో చిత్రం
  • 160 భాషల్లో 55 వేల థియేటర్లలో రిలీజ్
  • భారత్ లో తొలిరోజు రూ.40 కోట్లు రాబట్టిన చిత్రం
వెండితెరపై సముద్ర లోకాన్ని కళ్లు చెదిరే రీతిలో ఆవిష్కరించిన చిత్రం అవతార్-2. జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం డిసెంబరు 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవతార్-2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో 55 వేల థియేటర్లలో రిలీజైంది. భారత్ లో ఈ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నాయి. రివ్యూలు సైతం విజువల్ వండర్ అంటూ కీర్తిస్తున్నాయి. 

కాగా, ఈ చిత్రం భారత్ లో తొలి రోజున రూ.40 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే అవెంజర్స్ ఎండ్ గేమ్ కలెక్షన్లను మాత్రం అధిగమించలేకపోయిందని తెలిపాయి. 2019లో వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం రూ.53.10 కోట్లు వసూలు చేసింది. 

అటు, అమెరికాలో అవతార్-2 తొలిరోజున రూ.140 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడీ చిత్రానికి పెద్దగా పోటీ ఏమీ లేకపోవడం, పాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్ సీజన్ కావడం... ఇలా అనేక అనుకూలాంశాలతో ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించగలదని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Avatar-2
Collections
Day-1
India

More Telugu News