వైసీపీ వారు అవినీతికి కరప్షన్ హాలిడే ప్రకటించడం ఎంతైనా ప్రశంసనీయం: పవన్ కల్యాణ్ సెటైర్లు
- ఎన్నికలు దగ్గరపడ్డ నేపథ్యంలో అవినీతికి దూరంగా ఉండాలని మంత్రులకు సీఎం చెప్పినట్టు వార్తలు
- దీనిపై స్పందించిన జనసేన అధినేత
- సీఎం జగన్ పై సెటైర్ వేసిన పవన్ కల్యాణ్
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అవినీతికి దూరంగా ఉండాలని, ఎలాంటి ఆరోపణలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలంటూ సీఎం జగన్ మంత్రులకు స్పష్టం చేసినట్లుగా కొన్ని వార్తా పత్రికలు కథనాలు ప్రచురించాయి. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా అవినీతిపై మంత్రులతో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నాయి. దీనిపై స్పందించిన పవన్.. తనదైన శైలిలో సెటైర్లు వేశారు.