Chiranjeevi: నువ్వు శ్రీదేవైతే .. నేను చిరంజీవి: 'వాల్తేరు వీరయ్య' నుంచి సాంగ్ స్టిల్!

  • 'వాల్తేరు వీరయ్య'గా చిరంజీవి 
  • ఆయన సరసన కనువిందు చేయనున్న శ్రుతి హాసన్ 
  • చిరూ మార్క్ బాణీలను అందించిన దేవిశ్రీ 
  • ప్రీ రిలీజ్ ఈవెంటును జనవరి 8న విశాఖలో జరిపే ఆలోచన 
  • జనవరి 13వ తేదీన సినిమా విడుదల
Waltair Veerayya movie update

చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' సినిమా రూపొందుతోంది. మైత్రీవారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి రవితేజ పోర్షన్ ను ముగించే పనిలో ఉన్నారు.

దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో చిరంజీవి - శ్రుతి హాసన్ కాంబినేషన్లో ఒక పాటను చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఆ పాటకి సంబంధించిన ఒక ఫొటోను తాజాగా వదిలారు. 'నువ్వు శ్రీదేవైతే నేను చిరంజీవి' అంటూ ఈ పాట సాగనున్నట్టుగా చెప్పారు. 

పాటకి సంబంధించిన స్టిల్ లో చిరంజీవి ఫ్లూట్ వాయించే భంగిమలో మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఇక ఆయన సరసన శ్రుతి హాసన్ మంచుకొండల్లో విరిసిన మల్లెమొగ్గలా అందాలు వెదజల్లుతోంది. మొత్తానికి లేటెస్ట్ గా వదిలిన ఈ స్టిల్ కూడా సినిమాపై అంచనాలు పెంచేదిలా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును విశాఖలో జనవరి 8వ తేదీన నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది.

More Telugu News