అవతార్ 2 సినిమాకు తెలుగు మాటలు రాసింది ఎవరంటే!
- తెలుగు మాటలు రాసిన అవసరాల శ్రీనివాస్
- హాలీవుడ్ సినిమాలపై శ్రీనివాస్ కు మంచి పట్టు
- ఈ నెల 16న విడుదల కానున్న అవతార్ 2
సాధారణ సినిమాల మాదిరిగా కాకుండా ఆయా భాషల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా డైలాగ్స్ ఉండేలా చేసిందని తెలుస్తోంది. ఈ క్రమంలో తెలుగు వెర్షన్‌కు ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌తో మాటలు రాయించారు. శ్రీనివాస్ రచనా శైలి వైవిధ్యంగా ఉంటుంది. తాను దర్శకత్వం వహించిన పలు చిత్రాల్లో ఆయన రాసిన డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆయనకు హాలీవుడ్ సినిమాలపై మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో ‘అవతార్ 2’కి డైలాగ్స్ రాసే అవకాశం ఆయనకు వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకొని తనదైన శైలిలో ఈ హాలీవుడ్ చిత్రానికి తెలుగులో మాటలు రాశారని తెలుస్తోంది. అవసరాల శ్రీనివాస్ ప్రస్తుతం నాగశౌర్య హీరోగా ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ సినిమా రూపొందిస్తున్నారు.