శ్వాస తీసుకో పవన్ కల్యాణ్... ప్యాకేజీ వద్దు: అంబటి రాంబాబు
- పవన్ బస్సు యాత్ర కోసం ప్రత్యేక వాహనం
- వాహనానికి ఆలివ్ గ్రీన్ రంగు
- నిబంధనలకు విరుద్ధమన్న పేర్ని నాని
- శ్వాస అయినా తీసుకోనిస్తారా అంటూ పవన్ వ్యాఖ్యలు
- కౌంటర్ ఇచ్చిన అంబటి
ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. శ్వాస తీసుకో పవన్ కల్యాణ్... ప్యాకేజీ వద్దు అంటూ ఎత్తిపొడిచారు. కాగా, పవన్ బస్సుయాత్రం కోసం సిద్ధమైన వాహనం ఆలివ్ గ్రీన్ రంగులో ఉంది. సాధారణంగా సైనిక వాహనాలు ఈ రంగులో ఉంటాయి. సాధారణ ప్రజలు ఇలాంటి రంగులో వాహనాలను కలిగివుండడం నిబంధనలకు వ్యతిరేకమని మాజీ మంత్రి పేర్ని నాని నిన్న వ్యాఖ్యానించారు.