కేసీఆర్ కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

KCR will go for early elections
  • 6 నెలల్లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ప్రవీణ్ 
  • ఈడీ, ఐటీ సోదాలు బీజేపీ, టీఆర్ఎస్ ల డ్రామాలని కామెంట్ 
  • జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ 
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 6 నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని చెప్పారు. ఈడీ, ఐటీ సోదాలు టీఆర్ఎస్, బీజేపీలు కలిసి ఆడుతున్న డ్రామాలని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ అధికారి హత్యకు గురి కావడానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని చెప్పారు. 

52 శాతం ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లను కల్పిస్తే ఎలాగని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈ నెల 26 నుంచి పెద్ద ఎత్తున పోరాడుతామని చెప్పారు. కోటి సంతకాలను సేకరించి రాష్ట్రపతికి పంపుతామని అన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను కూడా పెంచాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని అన్నారు.
Go Back to Shorts
RS Praveen Kumar
BSP
KCR
TRS
Early Elections

More Telugu News