మెరీనా ఎలిమినేషన్ తో ఏడ్చేసిన రోహిత్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెరీనా ఎలిమినేషన్ తో ఏడ్చేసిన రోహిత్!

Bigg Boss 6  Update
  • బిగ్ బాస్ హౌస్ లో అందాల జంటగా రోహిత్ - మెరీనా 
  • ఇద్దరి ఆటతీరు కూడా సున్నితమే 
  • ఒకరి టెన్షన్ ఒకరు తీసుకుంటూ ముందుకెళ్లిన జంట 
  • రోహిత్ ను వదల్లేక వదల్లేక వెళ్లిన మెరీనా  
బిగ్ బాస్ హౌస్ లో ఓ అందమైన జంటకి కూడా అవకాశం ఇస్తూ వస్తున్నారు. అలా ఈ సీజన్ లో రోహిత్ - మెరీనా హౌస్ లోకి వచ్చారు. ఇద్దరూ బుల్లితెర నుంచి వచ్చినవారే. రోహిత్ హౌస్ లో ఉన్న వాళ్లందరి కంటే హ్యాండ్సమ్. అలాగే మెరీనా కూడా గ్లామర్ పరంగా మంచి మార్కులే సంపాదించుకుంటూ వచ్చింది. ఆరంభంలో కలిసి ఆడిన ఈ జంట, ఆ తరువాత బిగ్ బాస్ ఆదేశం మేరకు ఎవరికి వారుగా ఆడుతూ వచ్చారు. 

తాను ఏ గేమ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చినా మెరీనా పెద్దగా బాధపడేది కాదు. కానీ తన భర్త రోహిత్ విషయంలో మాత్రం ఆమె ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేకపోయేది. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా రోహిత్ గురించి ఎవరేం మాట్లాడుతున్నా, ఆమెలో ఒక రకమైన బాధ కనిపిస్తూ ఉండేది. ఇక ఆమెకి గల అనారోగ్య సమస్యను దృష్టిలో పెట్టుకుని రోహిత్ ఓదార్చుతూ రావడం కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. 

అలాంటి మెరీనా నిన్న హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఆ వెంటనే ఆమె తన భర్తను హగ్ చేసుకుని ఏడ్చేసింది. బయటికి వెళ్లలేక వెళ్లలేక వెళ్లింది. మెరీనా వెళ్లిపోయిన తరువాత రోహిత్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. రేవంత్ .. ఆదిరెడ్డి వంటివారు ఓదార్చుతున్నా ఆయన కంట్రోల్ చేసుకోవడం కష్టమైపోయింది. ఇంతవరకూ మెరీనా టెన్షన్ ను కూడా తాను తీసుకుంటూ వచ్చిన రోహిత్, ఇక తన ఆటతీరుతో ఎక్కడివరకూ వెళతాడో చూడాలి.
Rohith
Marina
Revanth
Adi Reddy
Bigg Boss

More Telugu News