Chiranjeevi: చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారు

First single form Waltair Veerayya ready to release
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం 'వాల్తేరు వీరయ్య' నుంచి తొలి పాట విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 23న సాయంత్రం 4.05 గంటలకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుందని చిత్రబృందం వెల్లడించింది. బాస్ పార్టీకి అందరూ సిద్ధం కండి అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది. 'వాల్తేరు వీరయ్య' చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తుండగా, చిరంజవి సరసన శృతి హాసన్, కాథరిన్ ట్రెసా నటిస్తున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా టైటిల్ సాంగ్ లో చిరు సరసన ఆడిపాడింది. 

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో చిరంజీవి, దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో వచ్చిన పలు చిత్రాల్లో పాటలు అదిరిపోయే రేంజిలో హిట్టయ్యాయి. ఈ నేపథ్యంలో, 'వాల్తేరు వీరయ్య' పాటలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Go Back to Shorts
Chiranjeevi
Waltair Veerayya
First Single
Bobby
Devi Sri Prasad

More Telugu News