'సార్ .. పోలీసులే నా ఫోన్ కొట్టేశారు': 'నేను స్టూడెంట్ సార్' టీజర్ రిలీజ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సార్ .. పోలీసులే నా ఫోన్ కొట్టేశారు': 'నేను స్టూడెంట్ సార్' టీజర్ రిలీజ్!

Nenu Student Sir Movie Teaser Released
  • బెల్లంకొండ గణేశ్ హీరోగా రూపొందిన 'నేను స్టూడెంట్ సర్'
  • దర్శకుడిగా రాఖి ఉప్పలపాటి 
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్ 
  • కథానాయికగా అవంతిక పరిచయం
తొలి సినిమా 'స్వాతి ముత్యం'తోనే బెల్లంకొండ గణేశ్ మంచి మార్కులు కొట్టేశాడు. లుక్ పరంగా .. నటన పరంగా ఆకట్టుకున్నాడు. ఆ తరువాత సినిమాగా 'నేను స్టూడెంట్ సర్' చేశాడు. సతీశ్ వర్మ నిర్మించిన ఈ సినిమాకి రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించాడు. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి, కొంతసేపటి క్రితం టీజర్ ను వదిలారు. 

హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంటును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో హిందీలో 'ఛత్రపతి' రీమేక్ చేస్తున్న వినాయక్, ఈ సినిమా టీజర్ ను లాంచ్ చేశారు. తాను కొత్తగా కొన్న ఐ ఫోన్ పోయిందనీ ... పోలీసులే దానిని కాజేశారని పోలీస్ స్టేషన్లో హీరో ఫిర్యాదు చేయడంపై ఈ టీజర్ మొదలవుతోంది.

అతనిని ఎవరో ప్లాన్ చేసి రింగ్ లోకి నెట్టేసినట్టుగా హీరోతో సునీల్ చెబుతాడు. అతను చెప్పినట్టుగానే పోలీస్ ఆఫీసర్ సముద్రఖని హీరోను టార్గెట్ చేస్తాడు. ఫలితంగా హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది అనేదే కథ అనే విషయం అర్థమవుతోంది. కథానాయికగా ఈ సినిమాతో భాగ్యశ్రీ కూతురు 'అవంతిక' పరిచయమవుతోంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. 
Bellamkonda Ganesh
Avanthika
Sunil
Samudrakhani

More Telugu News