వేమన విగ్రహం స్థానంలో వైఎస్ విగ్రహంపై పవన్ కల్యాణ్ స్పందన ఇదే!
Add ap7am to your home Screen

వేమన విగ్రహం స్థానంలో వైఎస్ విగ్రహంపై పవన్ కల్యాణ్ స్పందన ఇదే!

Pawan Kalyan reacts over Vemana statue replaced by YS statue
  • కడప యోగి వేమన వర్సిటీలో వేమన విగ్రహం తొలగింపు
  • వైఎస్ విగ్రహం ఏర్పాటు చేసిన అధికారులు
  • విమర్శలకు దారితీసిన నిర్ణయం
  • ఓ వేమన పద్యంతో స్పందించిన పవన్
కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయంలో వేమన విగ్రహం తొలగించి వైఎస్ విగ్రహం ఏర్పాటు చేయడం విమర్శలకు దారితీసింది. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. వేమన రాసిన ఓ పద్యాన్ని తాత్పర్యంతో పాటు పంచుకున్నారు. 

విద్యలేనివాడు విద్వాంసుచేరువ
నుండగానే పండితుండుగాడు
కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!

తాత్పర్యం: విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా అని అర్థం.

ఈ మేరకు పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. వేమన విగ్రహం తొలగింపునకు సంబంధించి ఓ పత్రికలో వచ్చిన కథనం తాలూకు క్లిప్పింగ్ ను కూడా పంచుకున్నారు.
Pawan Kalyan
Vemana Statue
YSR Statue
Yogi Vemana University

More Telugu News