'సార్' సినిమా నుంచి ఫస్టు సింగిల్ రెడీ .. రిలీజ్ ఎప్పుడంటే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సార్' సినిమా నుంచి ఫస్టు సింగిల్ రెడీ .. రిలీజ్ ఎప్పుడంటే!

Sir Movie Update
  • ధనుశ్ తాజా చిత్రంగా రూపొందిన 'సార్'
  • తమిళంలో 'వాతి' టైటిల్ ఖరారు 
  • రెండు భాషల్లోను డిసెంబర్ 2వ తేదీన విడుదల
  • విద్యా వ్యవస్థలోని లోపాల చుట్టూ తిరిగే కథ  

ధనుశ్ ఒక వైపున తమిళ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరో వైపున తెలుగులో నేరుగా సినిమా చేసే ఛాన్స్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. ముందుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయాలనుకున్నాడు. అయితే అందుకు సమయం ఉండటంతో, వెంకీ అట్లూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చాలా ఫాస్టుగా ఈ ప్రాజెక్టు పట్టాలపైకి వెళ్లింది. సితార నాగవంశీ - త్రివిక్రమ్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. 

ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు. ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయడానికి తాజాగా ముహూర్తాన్ని ఖరారు చేశారు. రేపు ఈ సినిమా నుంచి 'మాస్టారు ... మాస్టారు' అంటూ సాగే ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను శ్వేత మోహన్ ఆలపించింది. 

'సార్' సినిమాకి తమిళంలో 'వాతి' అనే టైటిల్ ను సెట్ చేశారు. విద్యా వ్యవస్థలోని లోపాలకు సంబంధించిన నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ రెండు భాషల్లోను ఈ సినిమాను డిసెంబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, సముద్రఖని .. సాయికుమార్ .. ఆడుకాలం నరేన్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
Dhanush
Samyuktha Menon
Samudrakhani
Sir Movie

More Telugu News