నాగశౌర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో మొదలైన కొత్త చిత్రం
- రామానాయుడు స్టూడియోలో కొత్త చిత్రం ప్రారంభం
- దర్శకుడిగా ఎస్.ఎస్. అరుణాచలం
- ఈ మధ్యే ‘కృష్ణ వ్రింద విహారి’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగశౌర్య
యువత, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో పాటు యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నామని చిత్ర బృందం ఈ సందర్భంగా ప్రకటించింది. నాగశౌర్య ఈ చిత్రంలో కొత్త తరహా పాత్రలో కనిపిస్తాడని తెలిపింది. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా.. వెట్రి పళనిసామి సినిమాటోగ్రాఫర్. చోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. హీరోయిన్‌తో పాటు ఇతర నటుల వివరాలను వెల్లడించాల్సి ఉంది. ఈ చిత్రాన్ని చింతలపూడి బ్రదర్స్ శ్రీనివాసరావు, విజయ్ కుమార్, డా.అశోక్ కుమార్ నిర్మిస్తున్నారు. నాగశౌర్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు సమాచారం.