చొక్కా పట్టుకుంటే.. చెప్పుతీసుకుని కొట్టండి: పవన్ కల్యాణ్
- వైసీపీ దౌర్జన్యాలపై తమ పోరాటం కొనసాగుతుందన్న పవన్
- మాకు మద్దతిచ్చేవారి ఇళ్లను కూలుస్తారా అని మండిపాటు
- దాడులు చేస్తే తాము కూడా తేల్చుకుంటామని హెచ్చరిక
'సజ్జల గారూ, మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కోవడానికి నేను సిద్ధం' అని పవన్ చెప్పారు. తనకు మద్దతిచ్చేవారి ఇళ్లను కూలుస్తారా? అని మండిపడ్డారు. వైసీపీ దౌర్జన్యాలపై ఇక నుంచి తమ పోరాటం సాగుతుందని అన్నారు. వైసీపీ వాళ్లు చొక్కా పట్టుకుంటే చెప్పు తీసుకుని కొట్టండని జనసైనికులకు సూచించారు. ఇకపై పద్ధతిగా రాజకీయం చేస్తే తాము కూడా అలాగే వెళ్తామని... దాడులు చేస్తే తాము కూడా తేల్చుకుంటామని వైసీపీని హెచ్చరించారు.