EMIలు ఉన్నవాడు అమ్మాయిల గురించి ఆలోచించకూడదురా: 'ఊర్వశివో రాక్షసివో ' ట్రైలర్లో ఆసక్తికర డైలాగ్!
- అల్లు శిరీష్ హీరోగా 'ఊర్వశివో రాక్షసివో'
- రొమాంటిక్ కామెడీ జోనర్లో నడిచే కథ
- సినిమాపై ఆసక్తిని పెంచుతున్న ట్రైలర్
- నవంబర్ 4వ తేదీన సినిమా రిలీజ్
తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. కామెడీ .. రొమాన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ప్రధానమైన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. "ఇన్ని EMIలు ఉన్నవాడు ఏ అమ్మాయి గురించి ఆలోచించకూడదురా" .. "సబ్ టైటిల్స్ లేకపోవడం వలన నాకు ఈ ఎపిసోడ్ ఏమిటో అర్థం కావడం లేదు సార్" అనేవి ఈ ట్రైలర్ లో హైలైట్ డైలాగ్స్.
ఈ సినిమాలో శిరీష్ - వెన్నెల కిశోర్ కాంబినేషన్లోని కామెడీ ఒక రేంజ్ లో కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకాన్ని అల్లు అరవింద్ వ్యక్తం చేశారు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.