తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కలకలం... చెత్తలో 3 తుపాకులు లభ్యం
- శాసన మండలి భవనాన్ని ఆనుకుని ఉన్న జూబ్లీ హాల్
- జూబ్లీ హాల్ పరిసరాలను శుభ్రం చేస్తుండగా కనిపించిన తపాకులు
- చెట్ల పొదల్లో ఓ తపంచా, 2 కంట్రీమేడ్ రివాల్వర్లు లభ్యం
- తుపాకులను స్వాధీనం చేసుకున్న సైఫాబాద్ పోలీసులు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన అక్కడకు చేరుకుని తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వానికి సంబంధించి ఏ ముఖ్య కార్యక్రమం అయినా జూబ్లీ హాల్ వేదికగానే జరిగేది. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఉన్నత స్థాయి అధికారులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యే వారు. ఇలాంటి ప్రదేశంలో తుపాకులు... అది కూడా చెట్ల పొదల్లో లభించడం గమనార్హం.