Allu Sirish: 'ఊర్వశివో రాక్షసివో' ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్టు ఎవరనేది సస్పెన్స్ లో పెట్టిన అల్లు అరవింద్

  • గీతా ఆర్ట్స్ 2 నుంచి మరో ప్రేమకథా చిత్రం 
  • అల్లు శిరీష్ జోడీగా అలరించనున్న  అనూ ఇమ్మాన్యుయేల్ 
  • ఈ నెల 30వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • నవంబర్ 4వ తేదీన సినిమా విడుదల  
Urvasivo Rakshasivo movie press Meet

అల్లు శిరీష్ - అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా 'ఊర్వశివో రాక్షసివో' సినిమా రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, నవంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. 

ఈ వేదికపై అల్లు అరవింద్ మాట్లాడుతూ .. " కొవిడ్ వలన ఈ సినిమా షూటింగు విషయంలో జాప్యం జరిగింది. ఈ కథ నచ్చి తమ్మారెడ్డి భరద్వాజ నుంచి లాక్కున్నాను. అందువలన ఆయనకి ఈ సినిమా రష్ చూపించాను. 'ఇంతమంచి కథ ఇస్తే ఇలా తీసావేమిటయ్యా' అని ఆయన అంటాడేమోనని అనుకున్నాను. కానీ ఆ రోజున రాత్రి ఆయన కాల్ చేసి, సినిమా చాలా బాగుందని చెప్పినప్పుడు 'హమ్మయ్య' అనుకున్నాను. 

ఈ సినిమాను నవంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నాము. ఈ లోగా ఈ నెల 30వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించనున్నాము. ఈ ప్రీ రిలీజ్ ఈవెంటుకి ఒక ముఖ్యమైన వ్యక్తి రానున్నాడు. ఆ వ్యక్తి ఎవరనేది సస్పెన్స్. ఆయన వలన ఆ ఫంక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది" అంటూ చెప్పుకొచ్చారు. మరి అల్లు అరవింద్ అంతగా ఊరించిన ఆ చీఫ్ గెస్టు ఎవరనేది చూడాలి.

More Telugu News