Anil Kumar Yadav: 2024 ఎన్నికల్లో గెలిచి ఏపీలో ప్రతిపక్షమే లేకుండా చేస్తాం: అనిల్ కుమార్ యాదవ్

We will win the 2024 elections and make AP without any opposition says Anil Kumar Yadav
షార్ట్స్‌లో చూడండి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వాన్ని పీకేసే సత్తా పీకేకు ఉందో? లేదో? తెలుసుకోవాలని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పవన్ కల్యాణ్ దత్తపుత్రుడనే విషయం రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసని చెప్పారు. అందరూ కలిసి కట్టకట్టుకుని వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఏమీ చేయలేరని... విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. 

2024 ఎన్నికల్లో గెలిచి, రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేస్తామని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సినిమా స్క్రిప్ట్ లతో పాటు, చంద్రబాబు ఇచ్చే స్క్రిప్ట్ లకు కూడా నటించే పవన్ ను ఎవరూ నమ్మరని వ్యాఖ్యానించారు. వైసీపీని ఓడించడం కాదని.. ముందు తాను పోటీ చేసే చోట గెలిచేందుకు ఆయన ప్రయత్నించాలని ఎద్దేవా చేశారు. పవన్ ముఖ్యమంత్రి కావడమనేది ఒక కలలానే మిగిలిపోతుందని... అందువల్ల అభిమానులు ఆయన వెంట తిరగడం మానుకోవాలని అన్నారు.
Go Back to Shorts
Anil Kumar Yadav
YSRCP
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam

More Telugu News