Janasena: ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి విజయవాడకు బయలుదేరిన పవన్ కల్యాణ్

pawan kalyan starts vijayawada from vizag in a special flight
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన కోసం రెండు రోజుల క్రితం విశాఖ వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం మధ్యాహ్నం అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. విశాఖలో ప్రత్యేక విమానం ఎక్కిన పవన్ కల్యాణ్... విజయవాడకు బయలుదేరారు. మరికాసేపట్లోనే విజయవాడ చేరుకుని, అనంతరం మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళతారు. 

ఇదిలా ఉంటే... పవన్ పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో విజయవాడలో జనసేన శ్రేణులు ఎక్కడ ఆందోళనకు దిగుతాయోనన్న భావనతో నగరంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు విజయవాడ వచ్చాక తన పర్యటనకు ఎదురైన అడ్డంకులపై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని పవన్ యోచిస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు ఇప్పటికే గవర్నర్ అపాయింట్ మెంట్ కోరామని, అయితే రాజ్ భవన్ నుంచి తమకు ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
Go Back to Shorts
Janasena
Pawan Kalyan
Vizag
Vijayawada
AP Governor

More Telugu News