తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన త్రిష
- మనసుకు నచ్చినవాడు దొరికితే పెళ్లి చేసుకుంటానన్న త్రిష
- తనను చేసుకునేవాడికి తనపై నమ్మకం ఉండాలని వ్యాఖ్య
- విడాకులు తీసుకోవడం తనకు నచ్చదన్న త్రిష
తనను పెళ్లి చేసుకునే వ్యక్తికి తనపై పూర్తి నమ్మకం ఉండాలని, అతను తన జీవితాంతం తనకు తోడుగా ఉంటాడని అనిపించాలని చెప్పింది. పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవడం తనకు నచ్చదని తెలిపింది. గతంలో తమిళ నిర్మాత వరుణ్ తో త్రిష నిశ్చితార్థం జరిగింది. అయితే కొన్నాళ్లకే ఇద్దరూ బ్రేకప్ అయ్యారు.