Prashant Kishor: నితీశ్ కుమార్ పై వయసు ప్రభావం పడుతోంది... ఒకటి మాట్లాడబోయి ఇంకొకటి మాట్లాడుతున్నారు: ప్రశాంత్ కిశోర్

Prashant Kishore satires on Nitish Kumar
షార్ట్స్‌లో చూడండి
బీహార్ సీఎం నితీశ్ కుమార్, జేడీయూ మాజీ నేత ప్రశాంత్ కిశోర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ, నితీశ్ కుమార్ పై వయసు ప్రభావం పడుతోందని, ఆయన భ్రాంతికి లోనవుతున్నారని వ్యాఖ్యానించారు. 

రాజకీయంగా ఏకాకిగా మారిన నితీశ్ కుమార్, ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల నితీశ్ ఎంతో అసహనంతో కనిపిస్తున్నారని, బహుశా అది వయసు ప్రభావం అనుకుంటా అని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. 

ప్రశాంత్ కిశోర్ బీహార్ లో పాదయాత్ర చేపడుతుండడం తెలిసిందే. దీనిపై నితీశ్ కుమార్ విమర్శిస్తూ, బీజేపీ కోసమే ప్రశాంత్ కిశోర్ పాదయాత్ర చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిశోర్ తాజాగా స్పందించారు. 

"నేను బీజేపీ అజెండాతో పనిచేస్తున్నానని ఆయన (నితీశ్ కుమార్) అంటున్నారు. అదే సమయంలో, ఆయన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని చెప్పానట. ఇది ఎలా సాధ్యమవుతుంది? నేను బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టయితే, ఆయన పార్టీని కాంగ్రెస్ లో కలిపేయాలని ఎలా చెబుతాను? ఒకవేళ ఆయన చేసిన రెండో ఆరోపణ కరెక్ట్ అయితే, మొదటి ఆరోపణ తప్పు అవుతుంది" అని వెల్లడించారు.
Go Back to Shorts
Prashant Kishor
Nitish Kumar
JDU
Bihar

More Telugu News