రెండూ ఒకే రోజు.. దేవుడి స్క్రిప్ట్‌.. జగన్ రెడ్డి భవిష్యత్తేంటో..?: నారా లోకేశ్ ట్వీట్‌
Add ap7am to your home Screen

రెండూ ఒకే రోజు.. దేవుడి స్క్రిప్ట్‌.. జగన్ రెడ్డి భవిష్యత్తేంటో..?: నారా లోకేశ్ ట్వీట్‌

nara lokesh satires on ap cm ys jagan
  • ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీ పేరు మార్చిన జ‌గ‌న్ స‌ర్కారు
  • పార్టీ శాశ్వత అధ్య‌క్షుడిగా ఎన్నిక చెల్ల‌దంటూ ఈసీ ప్ర‌క‌ట‌న‌
  • రెండింటినీ మిక్స్ చేసి జ‌గ‌న్‌పై సెటైర్ వ‌దిలిన లోకేశ్
వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ బుధ‌వారం రాత్రి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ సెటైరికల్ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైఎస్సార్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మారుస్తూ ఈ రోజు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇది జ‌రిగిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే వైసీపీ శాశ్వ‌త అధ్యక్షుడిగా జ‌గ‌న్ ఎన్నిక చెల్ల‌దంటూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. 

వ‌రుస‌గా జ‌రిగిన ఈ రెండు కీల‌క ప‌రిణామాల‌ను ప్ర‌స్తావిస్తూ జ‌గ‌న్‌పై నారా లోకేశ్ సెటైర్ సంధించారు. 'ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాడు.. తన పార్టీకి తానే అధ్యక్షుడు కాకుండా పోయాడు' అంటూ లోకేశ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రెండూ ఒకే రోజు జ‌రిగాయ‌ని, ఇది దేవుడి స్క్రిప్ట్ అని, జ‌గ‌న్ భ‌విష్య‌త్తు ఏమిటోన‌ని కూడా లోకేశ్ వ్యంగ్యం ప్ర‌ద‌ర్శించారు. త‌న ట్వీట్‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం వైసీపీకి రాసిన లేఖ ప్ర‌తిని కూడా ఆయ‌న జ‌త చేశారు.
YSRCP
YS Jagan
NTR University Of Health Sciences
Nara Lokesh
TDP

More Telugu News